Wednesday, January 22, 2025

కోహ్లి ఓ అసాధారణ క్రికెటర్: యశ్ దయాళ్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లిపై భారత యువ బౌలర్ యశ్ దయాళ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఓ అసాధారణ క్రికెటర్ అని కొనియాడాడు. కిందటి సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన యశ్ దయాళ్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. 2023లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన యశ్ ఆ తర్వాత బెంగళూరులో చేరి మెరుగైన ప్రదర్శనతో అలరించాడు. తాను ఈ స్థితికి చేరుకోవడానికి కోహ్లినే కారణమన్నాడు.

తనలో ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ గాడిలో పడేలా చేసిన ఘనత కోహ్లికే దక్కుతుందన్నాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో కోహ్లికి ఎవరూ సాటిరారన్నాడు. ఎలాంటి పరిస్థితులోనైనా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే సత్తా ఒక్క కోహ్లికి మాత్రమే ఉందన్నాడు. అతనితో కలిసి ఐపిఎల్‌లో ఆడడం తన కెరీర్‌ను మలుపు తిప్పిందన్నాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు కోహ్లి ఇచ్చిన సలహాలు, సూచనలు తనకు ఉపయోగ పడుతాయనే నమ్మకాన్ని యశ్ దయాళ్ వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News