Friday, December 20, 2024

టి20 జట్టు నుంచి విరాట్ ఔట్!

- Advertisement -
- Advertisement -

Kohli may will not play T20 Series against South Africa

జూన్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బిసిసిఐ. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఎంపిక చేసే టీమిండియా జట్టులో విరాట్ కోహ్లీని ఎంపిక చేయకపోవచ్చని బిసిసిఐ వర్గాలు చెబుతున్నాయి. ఇది అనధికారమే అయినప్పటికీ కోహ్లీ ఇప్పుడున్న ఫామ్‌ను చూస్తోంటే.. అది వాస్తవ రూపం దాల్చే అవకాశం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కోహ్లీకి ప్రస్తుతం విశ్రాంతి చాలా అవసరమని బిసిసిఐ సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతనికి విశ్రాంతిని కల్పించిన అనంతరం ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ఎంపిక చేయొచ్చని అంటున్నాయి.

Kohli may will not play T20 Series against South Africa

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News