Saturday, November 23, 2024

టి20 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లి ఆ రికార్డులు బ్రేక్ చేస్తారా!

- Advertisement -
- Advertisement -

kohli needs 240 runs become top in T20 World Cup

దుబాయ్: అక్టోబర్ 17 నుంచి టి20 ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. మొదటి వారంలో అర్హత మ్యాచ్‌లు జరగనుండగా.. అసలు మ్యాచ్‌లైన సూపర్ 12 దశ అక్టోబర్ 23నుంచి మొదలుకానుంది. ఇక రెండు గ్రూపులుగా విభజించిన సూపర్ 12లో.. గ్రూఫ్-1లో ఆస్ట్రేలియా, దక్షి ణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్ ఉండగా.. గ్రూఫ్-2లో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. వీటితో పాటు ఇరు గ్రూఫ్స్‌లోనూ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అర్హత సాధించిన జట్లు ఉండనున్నాయి. టి20 క్రికెట్ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. పొట్టి క్రికెట్‌లో ఎప్పుడు ఏ రికార్డు బద్దలవుతుందో చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.
విరాట్ కోహ్లి:
మెషిన్ గన్‌గా పేరు పొందిన విరాట్ కోహ్లి మరో 240 పరుగులు చేస్తే టి20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో తొలి స్థానంలో నిలవనున్నాడు. ప్రస్తుతం కోహ్లి టి20 ప్రపంచకప్‌లో 16 మ్యాచ్‌ల్లో 777 పరుగులు సాధించాడు. ప్రస్తుతం కోహ్లి ఉన్న ఫామ్ దృష్టా ఈ రికార్డు అందుకోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఇక శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం మహేళ జయవర్దనే 1016 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.
రోహిత్ శర్మ:
టీమిండియా వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ మరో 10 సిక్సర్లు బాదితే టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున అత్యధిక సిక్సర్లు బాదిన వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 24 సిక్సర్లు బాదాడు. యువరాజ్ సింగ్ 31 మ్యాచ్‌ల్లో 33 సిక్సర్లతో టీమిండియా తరపున తొలి స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా క్రిస్ గేల్(60 సిక్సర్లు), యువరాజ్(33), షేన్ వాట్సన్(31), ఏబీ డివిలియర్స్(30) సిక్సర్లతో వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
షకీబ్ అల్ హసన్:
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ముంగిట ఏకంగా రెండు రికార్డులు సాధించే అవకాశాలు ఉన్నాయి. మరో 10 వికెట్లు తీస్తే ఒక బౌలర్ గా టి20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం షకీబ్ 25 మ్యాచ్ ల్లో 30 వికెట్లతో ఉన్నాడు. కాగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది 39 వికెట్లతో టాప్ స్థానంలో ఉండగా.. లసిత్ మలింగ 38 వికెట్లతో రెండో స్థానంలో, సయీద్ అజ్మల్ 36 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేగాక షకీబ్ మరో రెండు వికెట్లు సాధిస్తే టి20 క్రికెట్‌లో లీడింగ్ వికట్‌టేకర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం మలింగ 84 మ్యాచ్‌ల్లో 107 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. షకీబ్ 88 మ్యాచ్‌ల్లో 106 వికెట్లు తీశాడు.

kohli needs 240 runs become top in T20 World Cup

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News