Thursday, December 26, 2024

కోహ్లీ దేశవాళీలో ఆడాలి

- Advertisement -
- Advertisement -

మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్
ముంబై: మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో ఘోరంగా ఓటమిపలై, సిరీస్‌ను చేజార్చుకుంది టీమిండియా. ఈ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే అని క్రికెట్ విశ్లేషకులు, మాజీలు అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరింత బాధ్యతగా ఆడాల్సిందని అంటున్నారు. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పిన్‌లో తడబడుతున్న కోహ్లీకి కొన్ని ముఖ్య సూచనలు చేశాడు. 2021 నుంచి ఆసియాలో కోహ్లీ 27 ఇన్నింగ్స్‌ల్లో 22 సార్లు స్పిన్‌లోనే ఔటయ్యాడు.

ఈ బలహీనతను అధిగమించాలంటే కోహ్లీ తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడాలని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని సూచించాడు. ’న్యూజిలాండ్ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లో మూడు సార్లు ఔటైన తీరు కోహ్లీని తీవ్రంగా నిరాశపరిచి ఉంటుంది. సూపర్ స్టార్‌డమ్‌కు చేరుకున్న తర్వాత సవాళ్లు ఎదురువుతుంటాయి. ఇప్పుడు మరో సవాల్ ఉంది.

స్పిన్ పిచ్‌లపై టీమిండియా ఆడాలనుకుంటే కోహ్లీ ఎలా రాణిస్తాడు’ అని పేర్కొన్నాడు. అయితే గత కొంతకాలగా కోహ్లీ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. గత రెండు మూడేళ్లలో స్పిన్‌కు వ్యతిరేకంగా అతని రికార్డు గొప్పగా ఏమీ లేదు. అతను ఏం చేయాలంటే.. దేశవాళీ క్రికెట్ తిరిగి వెళ్లాలి. ప్రస్తుత డీఆర్‌ఎస్ రూల్స్‌పై ఫోకస్ చేస్తూ ఆడాలి. ఎడమచేతి వాటం బౌలర్లు ప్రధాన ముప్పుగా ఉంటారనడంలో సందేహం లేదు” అని దినేశ్ అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News