Monday, December 23, 2024

మళ్లీ టాప్-10లోకి కోహ్లి

- Advertisement -
- Advertisement -

Kohli reached 9th position in T20 rankings

ఐసిసి టి20 ర్యాంకింగ్స్

దుబాయి: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టి20ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయిన కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని తొమ్మిదో స్థానంలో నిలిచాడు. చాలా కాలం పాటు టి20లో అగ్రస్థానంలో కొనసాగిన కోహ్లి ఆ తర్వాత పేలవమైన బ్యాటింగ్‌తో ర్యాంకింగ్స్‌లో కిందికి పడిపోయాడు. అయితే ఇటీవల కాలంగా కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లతో పాటు ఆసియాకప్‌లోనూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. తాజాగా వరల్డ్‌కప్‌లోనూ సత్తా చాటాడు. తాజా ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్10లో చోటు సంపాదించాడు. ఇక భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 849 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కివీస్ ఓపెనర్ కాన్వే తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News