దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రికార్డుల రారాజుగా పేరొందిన కోహ్లీ దాయాది పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీ20 క్రికెట్లో 100 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు, వన్డే, ఫార్మాట్.. మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్‌ల మైలురాయిని రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఘనతను కివీస్ మాజీ రాస్‌టేలర్ తొలిసారి అందుకోగా టేలర్ సరసన తాజాగా కోహ్లీ చేరాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ 100మ్యాచ్‌లు ఆడిన తొలి భారతక్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 2008లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 201731మధ్య 50మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 30మ్యాచ్‌ల్లో గెలిచి 16మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌లు టై అవగా మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఈ ఫార్మాట్‌లో కోహ్లీ విజయాల శాతం 64.58శాతంగా ఉంది.