న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో విరాట్ కోహ్లి ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే ఇతర దిగ్గజాలతో పోల్చితే అతనిలో ఓ బలహీనత స్పష్టంగా కనిపిస్తుందని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ప్రపం చ క్రికెట్‌ను శాసించిన సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, వివిఎన్.రిచర్డ్ తదితర దిగ్గజాలతో పోల్చితో విరాట్ కోహ్లికి ఓ కచ్చితమైన బలహీనత ఉందని మంజ్రేకర్ స్పష్టం చేశాడు. ఆ దిగ్గజాల్లో కచ్చితమైన బలహీనతలేమీ కనిపించవని, అయితే విరాట్ బ్యాటింగ్‌లో మాత్రం కచ్చితంగా అది స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. ఆఫ్ సైడ్ ఆవల బంతులు వేసిన ప్రతిసారి విరాట్ వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. అజింక్య రహానెలా అతను భిన్నమైన రీతిలో ఔట్ కావడం లేదు. ఇది కచ్చితంగా కోహ్లికి ప్రతికూలమైన అంశమేనని మంజ్రేకర్ పేర్కొన్నాడు. 2018 ఇంగ్లం డ్ పర్యటనలో కోహ్లిలో ఈ బలహీనత లేదన్నాడు. అందుకే ఆ పర్యటనలో అతను భారీగా పరుగులు సాధించగలిగాడన్నాడు. అయితే ఇటీవల కాలంలో కోహ్లి బ్యాటింగ్‌లో ఓ బలహీనత స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. ఆఫ్ స్టంప్ ఆవల చాలా దూరంగా వెళుతున్న బంతులను వెంటాడి వికెట్‌ను పారేసుకుంటున్నాడన్నాడు. ఈ లోపాన్ని సవరించుకోనంత కాలం విరాట్ బ్యాటింగ్ గాడిలో పడడం చాలా కష్టమైన అంశమేనని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
కోహ్లి ఆ లోపాన్ని సవరించుకోవాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -