విరాట్ కోహ్లి
చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూడడం బాధకు గురి చేసిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో ఘోరంగా విఫలమయ్యామని, అందుకే ఓటమి తప్పలేదని కోహ్లి అంగీకరించాడు. తమ దేహ భాష, ఆటలో స్థాయికి తగ్గ తీవ్రత కనిపించలేదన్నాడు. మరింత ప్రొఫెషనల్‌గా, నిలకడగా ఆడితే ఫలితం తమకు అనుకూలంగా ఉండేదన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించడం మ్యాచ్‌పై ప్రభావం చూపిందన్నాడు. ఇక తాము కూడా తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో మెరుగ్గానే ఉన్నా కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో అనుకున్న స్కోరు సాధించలేక పోయామన్నాడు. రానున్న మ్యాచుల్లో మాత్రం ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు తమకు చాలా కీలకమని కోహ్లి అభిప్రాయపడ్డాడు.