Monday, December 23, 2024

హోటల్ గది వీడియో లీక్‌పై కోహ్లి ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

Kohli Serious on Leaked video of Hotel Room

పెర్త్: ప్రపంచకప్‌లో పాల్గొంటున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. కొందరు కోహ్లి బస చేస్తున్న హోటల్ గదికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను హోటల్ గదిలో లేని సమయంలో కొందరు దీనిలో చొరబడి వీడియోలు తీయడంపై కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది చాలా భయానకమని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని పేర్కొన్నాడు. భారత స్టార్ ఆటగాడు కోహ్లి ఉంటున్న హోటల్‌లోని గదిలోకి వెళ్లిన కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఉన్న దుస్తులు, అతను ఉపయోగించే ఇతర వస్తువులకు సంబంధించిన వీడియోను తీసి దాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇక కింగ్ కోహ్లి హోటల్ రూం అని ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన కోహ్లి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇది ప్రైవసీకి భంగం కలిగించే అంశమన్నాడు. ఒకరికి సంబంధించి గదిలో అతని అనుమతి లేకుండా వెళ్లడం క్షమించరాని విషయమన్నాడు.

అభిమానులు తమకు ఇష్టమైన ఆటగాళ్లను చూసినప్పుడు ఎంతో ఆనందపడతారని, వాళ్లను కలిసేందుకు ఉత్సాహం కనబరచడాన్ని తాను అర్థం చేసుకోగలనన్నాడు. అలాంటి అభిమానాన్ని తాను కూడా అభినందిస్తానన్నాడు. కానీ ఈ వీడియో మాత్రం భయానకమన్నాడు. నా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వీడియోను చేసి షాక్‌కు గురయ్యానన్నాడు. దీనికి పాల్పడిన వారిని తాను ఎప్పటికీ క్షమించనన్నాడు. నా హోటల్ గదిలోనే నాకు ప్రైవసీ లేకపోతే..ఇంకెక్కడ ఉంటుందని వాపోయాడు. ఇలాంటి అర్థంపర్థంలేని అభిమానాన్ని తాను ఎప్పటికీ అంగీకరించనని కోహ్లి స్పష్టం చేశాడు. ఇకనైన ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించాడు. ఎవరినీ వినోద వస్తువుగా చూడొద్దని కోహ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

Kohli Serious on Leaked video of Hotel Room

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News