Wednesday, January 22, 2025

టి20 ప్రపంచకప్‌: కోహ్లిని జట్టులోకి తీసుకోవాలి..

- Advertisement -
- Advertisement -

Kohli Should be Select for T20 World Cup 2022: Syed Kirmani

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌లో ఆడే టీమిండియాలో విరాట్ కోహ్లికి చోటు కల్పించాలని భారత మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణి సూచించాడు. ఇటీవల కాలంలో కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విషయం వాస్తవమేనని, అంత మాత్రాన అతని ప్రతిభను తక్కువ చేసి చూడడం సరికాదన్నాడు. వచ్చే వరల్డ్‌కప్‌లో కోహ్లి కచ్చితంగా తుది జట్టులో ఉండాల్సిందేనన్నాడు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని జట్టును విజయపథంలో నడిపించే సత్తా కోహ్లికి మాత్రమే ఉందన్నాడు. ఇలాంటి ఆటగాడిని ఫామ్ కారణంగా జట్టుకు దూరంగా ఉంచడం సరికాదని కిర్మాణి అభిప్రాయపడ్డాడు.

Kohli Should be Select for T20 World Cup 2022: Syed Kirmani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News