- Advertisement -
దుబాయి: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ప్రశంసలు కురిపించాడు. కీలక సమయంలో విరాట్ ఫామ్‌ను అందుకోవడం టీమిండియాకు అతి పెద్ద ఊరటని అభిప్రాయపడ్డాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ రిజ్వాన్ ఇలా స్పందించాడు. తమ నుంచి విరాట్ మ్యాచ్‌ను లాగేశాడన్నాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుని విరాట్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడన్నాడు. అజేయ శతకంతో తానెంటో నిరూపించాడన్నాడు. అతనిలాంటి ఆటగాడు ఉండడం టీమిండియా అదృష్టమన్నాడు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని నిలబడే శక్తి కోహ్లికి మాత్రమే ఉందన్నాడు. ఇక వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడం ఎంతో బాధించిందన్నాడు. ఈ ఓటములు తమకు ఓ గుణపాఠమని రిజ్వాన్ వాపోయాడు.
- Advertisement -