Thursday, December 26, 2024

అదరగొట్టిన కోకా 2.0

- Advertisement -
- Advertisement -

Koka 2.0 song release from Liger

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా మూవీ‘లైగర్’ నుంచి డబుల్ ఎనర్జీ, డబుల్ స్వాగ్, డబుల్ బీట్‌తో విడుదలైన కోకా 2.0 పాట సెలబ్రేషన్స్‌ని మరింత పెంచింది. లిజో జార్జ్- డిజె చేతస్ మరొక డ్యాన్స్ నంబర్‌తో ముందుకు వచ్చిన ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే అద్భుతమైన మూమెంట్స్‌తో అదరగొట్టారు. గాయని గీతా మాధురితో కలిసి ఈ ఫాస్ట్ బీట్ నంబర్‌ని పాడడంలో రామ్ మిరియాల తన మార్క్ చూపించాడు. భాస్కరభట్ల అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది. ఈ పాటలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ భాంగ్రా స్టెప్పులు మైమరపించాయి. ఇక ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి వరంగల్ హన్మకొండలోని సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ‘లైగర్’ భారీ ఫ్యాండమ్ టూర్ నిర్వహించనున్నారు. పూరి కనెక్ట్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News