Friday, November 15, 2024

తెలంగాణ పరపతికి నిదర్శనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ. 100 కోట్ల కు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూ ములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుం డా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతున్నదని తెలిపారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించ పరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు.

ఎవరెంత నష్టం చే యాలని చూసినా ధృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప ట్టుదలకు, హైదరాబాద్ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హెచ్ ఎండిఎ అధికారులను, మంత్రి కెటిఆర్‌ను ,హెచ్ ఎండిఎ మెట్రోపాలిటన్ కమిషనర్, ఎంఎయూడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను సిఎం అభినందించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో గురువారం జరిగిన భూ ముల ఈ వేలం ద్వారా జరిగిన విక్రయంలో దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొనన్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని నియో పోలీస్ ఫేస్ టు లో జరిగిన వేలంపాటలో ఎకరానికి రూ. 100.75 కోట్లను చెల్లించి పోటీదారులు ప్లాట్లను స్వంతం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News