Thursday, April 3, 2025

కోకాపేట్‌లో భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం పైనుంచి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అతడు ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మృతుడు నాగ ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News