Thursday, January 23, 2025

టీచర్ మొబైల్ ఫోన్ లో ఐదు వేల నగ్న వీడియోలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి నడవడిక నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పక్కదారి పట్టాడు. ఉపాధ్యాయుడికి సంబంధించిన స్మార్ట్ ఫోన్లలో ఐదు వేల నగ్న వీడియోలు కనిపించడంతో ఉన్నతాధికారులు షాక్ కు గురయ్యారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా మూలూరు తాలూకాలో జరిగింది. మొరార్జీదేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో మునియప్ప అనే వ్యక్తి  డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్నారు. మునియప్ప తన మొబైల్  లతో విద్యార్ధినుల వీడియోలు చిత్రీకరించడంతో కొద్ది నెలల క్రితం పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మునియప్ప దగ్గర ఉన్న ఐదు ఫోన్లను సీజ్ చేశారు. ఫోన్లను డేటా ఫోరెన్సిక్ విభాగం రికవర్ చేయడంతో ఐదు వేల నగ్న వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అందులో విద్యార్థినుల వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News