Monday, December 23, 2024

పరువు హత్య: కూతుర్ని గడ్డివాములో తగులబెట్టిన కిరాతకుడు

- Advertisement -
- Advertisement -

పరువుహత్యల పేరిట పిల్లల పట్ల తల్లిదండ్రుల అమానుష కాండ కొనసాగుతూనే ఉంది. వేరే కులానికి లేదా మతానికి చెందిన వ్యక్తిని తమ కుమార్తె పెళ్ళాడిన పాపానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులే వారి ఉసురు తీస్తున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ పరువు హత్య సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. హత్య జరిగిన ఏడు నెలల తర్వాత ఈ దుర్ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.

కోలార్ జిల్లా మరవేమన గ్రామానికి చెందిన పదిహేడేళ్ల అర్పిత తన బంధువుల అబ్బాయిని ప్రేమించింది. అయితే అతను వరుసకు అన్న అవుతాడంటూ తల్లిదండ్రులు అర్పితను వారించి, ఆమెను మరొక యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. ప్రేమించిన అబ్బాయిని మరచిపోలేని అర్పిత.. పెళ్లి చేసుకున్న వ్యక్తితో సరిగా  కాపురం చేయలేదు. అల్లుడి ఫిర్యాదుపై అర్పిత తండ్రి రవి తన కూతురిని వెంటబెట్టుకుని మరవేమనకు బయల్దేరాడు. దారిలో ఇద్దరికీ మాటామాటా పెరగడంతో ముష్టూరు గ్రామ శివార్లలో కూతురిని గొంతు పిసికి చంపి, ఓ గడ్డివాములో శవాన్ని పడేసి నిప్పు పెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కుమార్తె కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. అయితే రవి ఘాతుకాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో రవిని అరెస్ట్ చేశారు. కూతుర్ని తానే హత్య చేసినట్లు రవి అంగీకరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News