Monday, January 20, 2025

కొల్లాపూర్ ఎంఎల్ఎ హర్షవర్ధన్ రెడ్డి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Kolhapur TRS MLA Harshavardhan Reddy arrested

కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బహిరంగ చర్చకు సిద్దమంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలును స్వీకరించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చర్చ కోసం ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరడంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఎంఎల్ఏను అక్కడి నుంచి పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎంఎల్ఏ ను కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ కొల్లాపూర్ బస్టాండ్ వద్ద ఎంఎల్ఏ అనుచరులు ఆందోళనకు దిగారు. జూపల్లి, బీరం ఇళ్లకు వెళ్లే మార్గాల్లో పోలీసులు ఎవరిని అనుమతించడంలేదు. బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కొల్లాపూర్ లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News