Sunday, November 3, 2024

జూలై 1 నుంచి కొలకలూరి ఇనాక్ సాహితీ సప్తాహం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : ప్రముఖ సాహితీవేత్త శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ 85వ జన్మదినం సందర్భంగా త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో సాహితీ సప్తాహం జూలై 1నుంచి 7వ తేదీ వరకు ఏడు రోజుల పాటు కళా సుబ్బారావు కళావేదికపై నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని గురువారం గానసభ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో ఆవిష్కరించి, మాట్లాడారు. ఇనాక్ త్యాగరాయగానసభతో ఎంతో అనుబంధం ఉందని ఆయన వ్యక్తిత్వం, సాహిత్య విశిష్టత దృష్టిలో ఉంచుకొని సాహిత్య సప్తాహం పేరిట ఆయన వివిధ ప్రక్రియల్లోని రచనలు రోజుకొకటి ఆవిష్కరిస్తామని తెలిపారు.

వరుసగా వ్యాస పరిణామం(పరిశోధన), వలస(నవల), ది క్కులేనోడు(నాటిక) విశాల శూన్యం(కవిత్వం), విమర్శిని(విమర్శ), పొలి(కథానిక), ఆల్మ్ ఆఫ్ పార్ధన్(అనువాదం) గ్రంధావి ష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారీ, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, ప్రము ఖ సాహితీవేత్త నందిని సిద్ధారెడ్డి, శాసనసభ తొలి సభాపతి ఎస్.మధుసూధనాచారీ, మా జి మంత్రి మండలి బుధ ప్రసాద్, గ్రంధాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొని ఆవిష్కరిస్తారని తెలిపారు. వివిధ రం గ ప్రముఖులు అతిథులుగా ప్రతి రోజు హాజరు అయ్యే కార్యక్రమాలకు తొలుత సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. సమావేశంలో గుండవరపు గీతాదేవి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News