Saturday, January 11, 2025

కొలకలూరి ఇనాక్ జీవితం స్ఫూర్తిదాయకం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ: సమాజంలో ఉన్న వివక్షతల వ్యతిరేక పరిస్థి తులు నుంచి ఇనాక్ శిఖరంలా ఏదిగారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె. రమణాచారీ అన్నారు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోనక, స్వయం కృషి తో ఉన్నతస్థాయికి చేరు కొనే వారు ఇనాక్… అని వారి జీవితం ఆదర్శం, స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడారు. త్యాగరాయగా నసభ ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల సాహితీ సప్తాహం శనివారం ఘనంగా ప్రారంభమైనది.

తొలిరోజు ఇనాక్ రచించిన వ్యాస పరిణామం పరిశోధన గ్రంధాన్ని రమణాచారీ విష్కరించి, మాట్లాడారు. తెలుగులో వెలువడిన వ్యాసాలను పరిశోధన అంశం గ్రహించటం ఇనాక్‌లో ఉన్న సృజనాత్మకతకు నిదర్శం అన్నారు. సాహి తీవేత్త గౌరీశంకర్ మాట్లాడుతూ.. మట్టి పోరల్లో నుంచి మొలకగా వెలువడి మొక్కగా వటవృక్షంగా ఎదిగిన ఇనాక్ తాను రాసిన.. ప్రతి అక్షరం కన్నీటి చుక్క అని చెప్పరని వివరించారు.

అధ్యక్షత వహించిన గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ.. సామాన్యుల కోసం సాహితీ కృషి చేసిన ఇనాక్ 85వ జన్మదినం సాహిత్య సప్తాహంగా జరపడం త్యాగరాయగానసభ సముచితమని భావించామన్నారు. కార్యక్రమంలో కొల కలూరి మధుజ్యోతి, ఆచార్య కొలకలూరి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News