Monday, December 23, 2024

వైద్యురాలి శరీరంపై 14 చోట్ల గాయాలు

- Advertisement -
- Advertisement -

వైద్యురాలి శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని శవ పరీక్షలో గుర్తించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్టు ఆ నివేదికలో ఉంది. ఊపిరితిత్తుల్లో ఎక్కువ మొత్తం రక్తస్రావం జరిగినట్టు పోస్ట్‌మార్టమ్‌లో గుర్తించారు. సంఘటన సమయంలో నిందితునితో విపరీతంగా ఆమె పోరాడి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. నిందితుడు సంజయ్ రాయ్‌కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు

అతడి శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కన్పించాయని, బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా, ఆమె గోళ్ల లోని చర్మం, రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో సరిపోలినట్టు తెలుస్తోందని అధికార వర్గాలు వెల్లడించినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లనే ఆమె మృతి చెందినట్టు పోస్ట్‌మార్టమ్ నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉంటాడని నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News