Thursday, January 23, 2025

బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్ గెల్చుకున్న “ముత్తయ్య”

- Advertisement -
- Advertisement -

కె సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “ముత్తయ్య”. ఈ చిత్రాన్ని హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు బ్యానర్స్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, వ్రిందా ప్రసాద్ నిర్మించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు.

గతంలో యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించిందీ చిత్రం. ఈ ఏడాది మే 9న లండన్ లోని రిచ్ మిక్స్ లో ప్రీమియర్ అయ్యింది. తాజాగా కోల్ కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా అవార్డ్ గెల్చుకుంది. కాంపిటేషన్ ఆన్ ది ఇండియన్ లాంగ్వేజ్ ఫిలింస్ కేటగిరీలో ఈ పురస్కారం దక్కింది.

ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కడంపై దర్శక నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత కేదార్ సెలగం శెట్టి మాట్లాడుతూ…ప్రఖ్యాత కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మా ముత్తయ్య సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ దక్కడం గర్వంగా ఉంది. మా సినిమా మరింత మందికి స్ఫూర్తి పంచుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ*…ముత్తయ్య అనేక జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పురస్కారాలు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లాంటి ప్రతిష్టాత్మక వేడుకల్లో అవార్డ్ రావడం పట్ల ఆనందంగా ఉన్నాం. అన్నారు.

నిర్మాత వ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ…కేఐఎఫ్ఎఫ్ లో ముత్తయ్య సినిమాకు దక్కిన గౌరవం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఈ చిత్రోత్సవాల్లో మా సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో ఓ మంచి చిత్రాన్ని చూశామనే సంతృప్తి కనిపించింది. ముత్తయ్యలోని కథా కథనాలే ప్రపంచవ్యాప్తంగా చిత్రోత్సవాల్లో ఆదరణ పొందేందుకు కారణంగా నిలుస్తున్నాయి. మా దర్శక నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నా. అన్నారు.

దర్శకుడు భాస్కర్ మార్య మాట్లాడుతూ…ఈ సినిమా తెరకెక్కించే ముందు ఇదొక కలగా ఉండేది. ఇప్పుడు ఊహించనన్ని ఆశ్చర్యాలను తీసుకొస్తోంది. ముత్తయ్య సినిమా మాకెంతో పేరు, గౌరవాన్ని అందిస్తోంది. ఒక దర్శకుడిగా ఇలాంటి గుర్తింపు దక్కడం మంచి సినిమాలు రూపొందించాలనే ఉత్సాహాన్ని పెంచుతోంది. అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News