ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాలు పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో సిఎస్‌కెను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్‌కె 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగు లు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ (29) ఒక్కడే కాస్త ధాటిగా ఆడాడు. శివమ్ దూబు 31 (నాటౌ ట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ మూడు, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యా టింగ్ చేపట్టిన కోల్‌కతా 10.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అ దుకుంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, సునీల్ నరైన్ మెరుపు ఆరంభాన్ని అందించారు. డికాక్ 16 బం తుల్లోనే 3 సిక్సర్లతో 23 పరుగులు చేశాడు. వి ధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన నరైన్ 18 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, రెండు సిక్స్‌లతో 44 పరగులు సా ధించాడు. కెప్టెన్ రహానె 20 (నాటౌట్), రింకు సింగ్ 15 (నాటౌట్) కీలక పాత్ర పోషించారు.
కోల్‌కతా చేతిలో చెన్నై చిత్తు
- Advertisement -
- Advertisement -
- Advertisement -