Monday, December 23, 2024

కోల్‌కతా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన విరాట్ కోహ్లి 59 బంతుల్లోనే 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

కామెరూన్ గ్రీన్ (33), మ్యాక్స్‌వెల్ (28), కార్తీక్ (20) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 16.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (30), సునీల్ నరైన్ (47) మెరుపు ఆరంభాన్ని అందించారు. తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ (50), శ్రేయస్ అయ్యర్ 39 (నాటౌట్) కూడా రాణించడంతో కోల్‌కతా సునాయాస విజయం అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News