Friday, November 8, 2024

ఫ్లయింగ్ కిస్ ఇచ్చి దొరికిపోయిన క్రికెటర్!

- Advertisement -
- Advertisement -

క్రికెట్ లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. వాటిని అంతే ఖచ్చితంగా అమలు చేస్తారు కూడా. ఆటగాళ్లు క్రమశిక్షణ పాటించేందుకే ఈ నియమ నిబంధనలన్నీ! తాజాగా మొదలైన ఐపీఎల్ లో శనివారం కోల్ కతా నైట్ రైడర్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీ జరిగిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ ను అద్భుతంగా బౌల్ చేసి, కీలకమైన వికెట్లు తీసిన కోల్ కతా యువ బౌలర్ హర్షిత్ రాణాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో హర్షిత్ చేసిన ఓ తప్పిదం అతను భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది.

ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (32 పరుగులు) ను హర్షిత్ రాణా అవుట్ చేసిన సందర్భంలో మయాంక్ కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇలా చేయడం ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధం. దీంతో హర్షిత్ మ్యాచ్ ఫీజులో ఏకంగా 60 శాతాన్ని జరిమానాగా విధించారు. రాణా ప్రవర్తనను ప్రముఖ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా తప్పు పట్టాడు. ‘రాణా అలాచేయడం తప్పు. ఎవరైనా బ్యాటర్ రాణా బౌలింగ్ లో సిక్స్ కొట్టి అతనికే ఫ్లయింగ్ కిస్ ఇస్తే ఎలా ఉంటుంది?’ అని గవాస్కర్ ప్రశ్నించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News