రాణించిన బౌలర్లు n అయ్యర్ మెరుపులు n ఢిల్లీ ఇంటికి
షార్జా: ఐపిఎల్ సీజన్14లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయర్2 పోరులో కోల్‌కతా మూడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఒక దశలో కోల్‌కతా అలవోకగా గెలుస్తుందని భావించినా ఢిల్లీ బౌలర్లు అసాధారణ పోరాట పటిమను కనబరిచి దాదాపు మ్యాచ్ గెలిచినంత పని చేశారు. అయితే చివరి ఓవర్ ఐదో బంతికి రాహుల్ త్రిపాఠి అద్భుత సిక్స్‌ను కొట్టడంతో కోల్‌కతా విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపిఎల్ ఫైనల్‌కు చేరాలని భావించిన ఢిల్లీకి నిరాశే మిగిలింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది.
అయ్యర్ జోరు..
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెన ర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్‌లు శుభారంభం అందిం చారు. గిల్ సమన్వయంతో ఆడగా అయ్యర్ దూకుడును ప్రద ర్శించాడు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో స్కోరును ముందు కు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఢిల్లీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అయ్య ర్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఢిల్లీ బౌలర్ల ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. అత న్ని కట్టడి చేసేందుకు ఢిల్లీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలిం చలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 41 బంతుల్లోనే మూడు సిక్సర్లు, 4 ఫోర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యా డు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాడు.
మలుపులు తిరిగింది
అయ్యర్ ఔటైన తర్వాత ఢిల్లీ బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. అవేశ్ ఖాన్, రబడా, నోర్జేలు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగి పోయారు. దీంతో కోల్‌కతా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఒక దశలో వికెట్ నష్టానికి 122 పరుగులతో పటిష్టంగా ఉన్న నైట్ రైడర్స్ 130 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది. గిల్ (46) పరుగు లు చేసి ఔటయ్యాడు. కాగా, కార్తీక్ (౦), మోర్గాన్ (0), షకి బ్ (0), నరైన్ (0)లు ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. అయితే రాహుల్ త్రిపాఠి 12 (నాటౌట్) చివరి వరకు నాటౌట్‌గా నిలిచి కోల్‌కతాను ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో ధావన్ (36), అయ్యర్ 30 (నాటౌట్) మాత్రమే రాణించారు.