Sunday, April 27, 2025

కోల్‌కతా టార్గెట్ 202

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత ఇన్నింగ్స్ చేపట్టిన కోల్‌కతా ఒక ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆటను నిలిపి వేశారు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ శుభారంభం అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ప్రియాంశ్ 35 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 49 బంతుల్లో 6 సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో 83 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. జోష్ ఇంగ్లిస్ 11 (నాటౌట్) కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్ స్కోరు 201 పరుగులకు చేరింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా2, వరుణ్ చక్రవర్తి, రస్సెల్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News