Wednesday, January 22, 2025

ఇరు జట్లకు కీలకం

- Advertisement -
- Advertisement -

నేడు కోల్‌కతాతో సన్‌రైజర్స్ ఢీ

పుణె: ఐపిఎల్‌లో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కాతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి. ప్లేఆఫ్ రేసులో నిలువాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఇరు జట్లకు నెలకొంది. ఇప్పటి వరకు రెండు జట్లు ఐదేసి విజయాలు సాధించాయి. అయితే కోల్‌కతా ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడింది. హైదరాబాద్ ఒక మ్యాచ్ తక్కువ ఆడడం కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇక తొలి రౌండ్ మ్యాచ్‌లో కోల్‌కతాను హైదరాబాద్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అలాంటి సంప్రదాయాన్నే కొనసాగించాలనే పట్టుదలతో సన్‌రైజర్స్ ఉంది. అయితే వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడడంతో హైదరాబాద్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలవడం అంత తేలికేం కాదనే చెప్పాలి.

ఇక కోల్‌కతాలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. వారిలో ఏ ఇద్దరు రాణించినా హైదరాబాద్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం సన్‌రైజర్స్‌ను వెంటాడుతోంది. జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఘోరంగా విఫలమవుతున్నాడు. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా అతను తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహుల్ త్రిపాఠి, మార్‌క్రామ్, పూరన్, అభిషేక్ తదితరులు ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరోదాంట్లో విఫలమవుతున్నారు. నిలకడగా ఆడడంలో వీరు వైఫల్యం చవిచూస్తున్నారు. బౌలింగ్‌లో కూడా నిలకడగా కనిపించడం లేదు. ఒకరిద్దరూ మాత్రమే రాణిస్తుండగా మిగతావారు ఆశించిన స్థాయిలో సత్తా చాటలేక పోతున్నారు. ఇలాంటి స్థితిలో వరుసగా మూడు మ్యాచులు గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలువడం హైదరాబాద్‌కు అంత సులువేమీ కాదనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News