ఐపిఎల్ సీజన్ 2025లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ సమష్టిగా పోరాడి జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అంగ్‌కృష్ రఘువంశీ (44), రింకూ సింగ్ (36), గుర్బాజ్ (26), నరైన్ (27), కెప్టెన్ రహానె (26) పరుగులు చేశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ ఒక్కడే మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డుప్లెసిస్ 7 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ 23 బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. విప్రజ్ నిగమ్ (38) కూడా ధాటిగా బ్యాటింగ్ చేసినా జట్టును గెలిపించలేక పోయాడు.