Sunday, December 22, 2024

IPL 2024: ఉత్కంఠ పోరులో ఒక పరుగు తేడాతో బెంగళూరు ఓటమి

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 17వ సీజన్ లో ఉత్కంఠభరిత పోరులో బెంగళూరుపై కోల్ కతా జట్టు విజయం సాధించింది. చివరి బంతి వరుకు సాగిన ఈ మ్యాచ్ లో ఒక పరుగు తేడాతో బెంగళూరు ఓడిపోయింది. కోల్ కతా నిర్ధేశించిన 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  బెంగళూరు బ్యాట్స్ మెన్లలో విల్ జాక్స్(55), రజత్ పటిదార్(52)లు అర్థ శతకాలతో మెరవగా.. ప్రభుదేశాయ్(24), దినేష్ కార్తిక్(25), కరన్ శర్మ(20)లు మెరుపు మెరిపించినా లాభం లేకపోయింది.

చివరి బంతికి బెంగళూరు జట్టుకు రెండు పరుగులు కావాలి. ఈ సమయంలో క్రీజులో ఉన్న ఫర్గుసన్ షాట్ కు యత్నించగా.. ఫీల్డర్ బంతి అందుకోవడంతో రెండో పరుగు తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో కోల్ కతా ఒక పరుగు తేడాతో బెంగళూరును ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News