Monday, December 23, 2024

కోల్‌కతాలో ఒక్కటైన లెస్బియన్ జంట

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : ఎల్‌జిబిటిక్యూ సమాజంలో కోల్‌కతాకు చెందిన లెస్బియన్ జంట ఒక్కటైంది. నగరానికి చెందిన మౌసుమి దత్తా, మౌమిత మజుందార్ జంటగా మారారు. హల్దీ, సంగీత్, మెహందీ వంటి వేడుకలు పూర్తయిన తరువాత వారు దండలు మార్చుకుని దంపతులయ్యారు.

తమ జీవిత భాగస్వాములను ఎంచుకోడానికి ఎల్జీబీటీక్యూ జంటలకు ఈ వివాహాలు ఆదర్శంగా నిలుస్తాయని భావిస్తున్నారు. ప్రేమ ముందు జెండర్ అనేది అరుదవుతుందని మౌసుమి దత్తా చెప్పారు. 2018లో స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చగా, స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడం ఇప్పటికీ చట్ట విరుద్ధంగానే ఉంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News