Monday, January 20, 2025

పక్కింట్లో ఉండే వ్యక్తి బాలికను చంపి.. గన్నీ బ్యాగ్‌లో మూటకట్టాడు…

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పక్కింట్లో ఉండే వ్యక్తి ఏడు సంవత్సరాల బాలికను చంపి తన ఇంట్లో గన్నీ బ్యాగ్‌లో మృతదేహాన్ని మూటకట్టి పెట్టిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని తిల్‌జాలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీధర్ రాయ్ రోడ్డులో ఓ ఆపార్ట్‌మెంట్‌లో 32 ప్లాట్‌లు ఉన్నాయి. దీంతో ఏడేళ్ల బాలిక కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆపార్ట్‌మెంట్‌కు చేరుకొని ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఎక్కడ బాలిక ఆచూకీ కనిపించలేదు. సిసి టివిలో మాత్ర ప్లాట్ పక్కన ఉంటే మరో ప్లాట్‌లో వెళ్లినట్టు గుర్తించారు.

పక్కన ఉండే ప్లాట్‌కు తాళాలు వేయడంతో డోర్‌ను బద్దలు కొట్టి చూడగా రక్తపు మరకలతో గన్నీ బ్యాగ్ కనిపించింది. వెంటనే బ్యాగ్ ఓపెన్ చేయగానే బాలిక మృతదేహం కనిపించింది. బాలిక తల, మెడ, చెవిపై గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పారిపోతున్న ప్లాట్ యజమాని అలోక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలోక్ కుమార్ స్వస్థలం బిహార్ రాష్ట్రం సమస్థిపూర్ ప్రాంతంగా గుర్తించారు. పోలీసులు తానే హత్య చేశానని అలోక్ కుమార్ ఒప్పుకున్నారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎందుకు హత్య చేశారని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News