Monday, December 23, 2024

నుపూర్ శర్మకు కోల్‌కత పోలీసుల సమన్లు

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బిజెపి నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆ పార్టీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు కోల్‌కత పోలీసులు సమన్లు జారీచేశారు. నుపూర్ శర్మపై నార్కదంగ పోలీసు స్టేషన్‌లో ఒక ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. నుపూర్ శర్మ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఈ నెల 20న పోలీసు స్టేషన్‌కు రావాలని పోలీసులు ఆమెకు సమన్లు జారీచేశారు. ఒక టివి డిబేట్ సందర్భంగా నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోని వివిధ ప్రాంతాలలో హింసాత్మ నిరసనలకు దారితీశాయి. ఆమె వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి అబుల్ సోహెల్ కూడా కొంతాయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Kolkata Police summons to Nupur Sharma

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News