Friday, November 22, 2024

కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు

- Advertisement -
- Advertisement -

Kolkata thrashed Royal Challengers Bangalore by 9 wickets

కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు

దుబాయి: ఐపిఎల్ రెండో దశ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే ప్రదర్శనతో ఆకట్టుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు ప్రత్యర్థి బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 10 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సునాయాస విజయ లక్ష్యాన్ని నైట్‌రైడర్స్ అలవోకగా ఛేదించింది.

ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతాకు మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. లక్షం పెద్దగా లేక పోవడంతో కోల్‌కతా ఓపెనర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 34 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్స్‌తో 48 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ వెంకటేశ్ 27 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా మరో పది ఓవర్లు మిగిలివుండగానే అలవోక విజయం సాధించింది. ఈ సీజన్‌లో నైట్‌రైడర్స్‌కు ఇది మూడో విజయం కావడం విశేషం. తొలి దశ మ్యాచుల్లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన కోల్‌కతా రెండో దశ ఆరంభ మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే ప్రదర్శనతో బలమైన బెంగళూరును చిత్తుచిత్తుగా ఓడిండం గమనార్హం.

ఆరంభం నుంచే..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ కోహ్లి (4)ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ పంపించాడు. అప్పటికీ చాలెంజర్స్ స్కోరు పది పరుగులు మాత్రమే. ఈ దశలో వన్‌డౌన్‌లో వచ్చిన శ్రీకర్ భరత్‌తో కలిసి మరో ఓపెనర్ దేవ్‌దుత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచేందుకు ప్రయత్నించాడు. అయితే 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన పడిక్కల్‌ను ఫెర్గూసన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, రసెల్ చెలరేగి పోయారు. వీరి ధాటికి బెంగళూరు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. జట్టును ఆదుకుంటారని భావించిన స్టార్ ఆటగాళ్లు మాక్స్‌వెల్ (10), డివిలియర్స్ (0) ఘోరంగా విఫలమయ్యారు. సచిన్ బేబి (7), వానిండు హసరంగా (0), జేమీసన్ (4) కూడా జట్టును ఆదుకోలేక పోయారు. కోల్‌కతా బౌలర్లలో చక్రవర్తి 13 పరుగులకు మూడు వికెట్ల పడగొట్టాడు. రసెల్ కూడా 9 పరుగులు మాత్రమే ఇచ్చి తన ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. ఫెర్గూసన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక బెంగళూరు ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీసం 25 పరుగుల స్కోరును అందుకోలేక పోయాడు. దీంతో చాలెంజర్స్ ఇన్నింగ్స్ 92 పరుగులకే పరిమితమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News