Friday, December 20, 2024

సమరోత్సాహంతో సన్‌రైజర్స్.. నేడు ఉప్పల్‌లో కోల్‌కతాతో పోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా సన్‌రైజర్స్‌కు కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో హైదరాబాద్ కనిపిస్తోంది.

మరోవైపు కోల్‌కతాకు కూడా ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఆరింటిలో పరాజయం చవిచూసింది. వరుస ఓటములతో కోల్‌కతా తన ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఇలాంటి స్థితిలో హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా ప్రయోజనం లేకుండా పోతోంది. వరుస ఓటములు కోల్‌కతాను వెంటాడుతున్నాయి. ఇక ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లో పరాజయాలకు పుల్‌స్టాప్ పెట్టి ముందుకు సాగాలని కోల్‌కతా తహతహలాడుతోంది. ఇరు జట్లకు కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో విజయం ఎవరికీ దక్కుతుందో వేచిచూడాల్సిందే.

బ్యాటింగే సమస్య..
ఈ సీజన్‌లో హైదరాబాద్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. బ్యాటింగ్ వైఫల్యంతో స్వల్ప లక్ష్యాలను సయితం సన్‌రైజర్స్ ఛేదించలేక పోతోంది. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌లు మాత్రమే నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి తదితరులు స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. బ్రూక్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే రాణించాడు. మిగతా పోటీల్లో ఘోరంగా విఫలమయ్యాడు. అగర్వాల్, త్రిపాఠి, మార్‌క్రమ్‌లు కూడా బ్యాట్‌తో విఫలమవుతున్నారు. వీరి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా వీరంతా సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. లేకుంటే హైదరాబాద్‌కు ఇబ్బందులు ఖాయం.

సవాల్ వంటిదే..
మరోవైపు కోల్‌కతాకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. వరుస ఓటములతో కోల్‌కతా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీ స్కోర్లు సాధిస్తున్నా మ్యాచ్‌లను కాపాడుకోలేక పోతోంది. కొన్ని మ్యాచుల్లో స్వల్ప లక్ష్యాలను సయితం ఛేదించలేక బోర్లా పడుతోంది. ఇలాంటి స్థితిలో సొంత గడ్డపై ఆడుతున్న సన్‌రైజర్స్‌ను ఓడించడం నైట్‌రైడర్స్‌కు తేలికేం కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తేనే గెలుపు అవకాశాలుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News