కోల్‌కతా: రింకు సింగ్ గుజరాత్ టైటాన్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి మూడువారాలైంది. నరేంద్రమోడీ స్టేడియం వేదికగా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత రెండు జట్ల ప్రస్థానం భిన్నంగా సాగింది. డిఫెండింగ్ గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్‌లు గెలిచి పట్టికలో పది పాయింట్లతో టాప్ హాఫ్‌లో నిలిచారు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచిన పాయింట్ల నిచ్చెనపై నిలదొక్కుకున్న నైట్‌రైడర్స్ అంతకుముందు నాలుగు ఓటములను చవిచూశారు. ఆరుపాయింట్లతో కిందినుంచి నాలుగోస్థానంలో ఉన్నారు. మొదటి నాలుగుస్థానాలలో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన మణికట్టు స్పిన్నర్లలో కోల్‌కతా, గుజరాత్ జట్లు టాప్‌లో ఉన్నాయి.
ఈక్రమంలో రెండుజట్లలో స్పిన్నర్లు మరోసారి ఆధిపత్యం కోసం బరిలోకి దిగనున్నారు. భారత్ పేస్ జోడీ మోహిత్ శర్మ తమ ఖాతాలో వేసుకున్నారు. కోల్‌కతా పేస్ దళం బలహీనంగా ఉండటం టైటాన్స్‌కు కలిసొచ్చే అంశం. రస్సెల్ బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్న బ్యాటింగ్‌లో తేలిపోతున్నాడు. వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, రింకుపైనే కోల్‌కతా ఎక్కువగా ఆధారపడుతోంది. టైటాన్స్ జట్టు బ్యాటర్లలో గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య నైట్‌రైడర్స్‌కు వ్యతిరేకంగా 366పరుగులు చేశాడు. 173.46 స్ట్రైక్‌రేటుతో 61సగటుతో ఉన్నాడు. అదేవిధంగా బౌలింగ్‌లోనూ రాణించి కోల్‌కతాపై 11వికెట్లు తీశాడు. నేటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఇన్నింగ్స్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కోల్‌కతా తరఫున ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ నేడు ఆడే అవకాశం ఉంది.