Sunday, April 13, 2025

దుకాణాల కేటాయింపులో పారదర్శకత పాటించాం: కొల్లు రవీంద్ర

- Advertisement -
- Advertisement -

అమరావతి: నూతనంగా నిర్మించిన మద్యం గోదామును, జిల్లా ఎక్సైజ్ శాఖ పరిపాలన భవనాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. తదుపరి అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంలో అనేకమందిపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. పోలీసుల బట్టలు ఊడదీస్తానన్న జగన్ పై క్రిమినల్ కేసు పెట్టాలని మండిపడ్డారు. దేశంలో 6 రాష్ట్రాల్లో పర్యటించి మద్యం కొత్త పాలసీ తెచ్చామని అన్నారు. గోదాము నుంచి వెళ్లే ప్రతి స్టాక్ వాహనాన్ని ట్రాక్ చేస్తామని చెప్పారు. గోదాం నుంచి దుకాణం వద్దకు వాహనం వెళ్లేవరకు పర్యవేక్షిస్తామని, దుకాణాల కేటాయింపులో పారదర్శకత పాటించామని తెలియజేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వంలో మద్యం కొనుగోళ్ల అక్రమాలన్నీ వెలికితీస్తున్నామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News