Wednesday, January 8, 2025

డబుల్ హ్యాపీ..

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః నగరంలో నిరుపేదలకు పెద్ద శుభవార్త. సొంతింటి కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న నిరు పేదల కల నేరవేరనుంది. నగరంలోని నిరుపేదలకు నయా పైసా ఖర్చు లేకుండా వారి సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. దేశంలోనే పేదల అతిపెద్ద హౌజింగ్ టౌన్ షిప్ కొల్లూర్ డబుల్ బెడ్ రూం ఇళ్లను ఈ నెల 22 గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేతుల మీదగా ప్రారంభించనున్నారు. ఒకే చోట 145.50 ఎకరాల సువిశాల స్థలంలో రూ.1489.29 కోట్ల వ్యయంతో 117 బ్లాక్‌ల్లో ఎస్-9, ఎస్+10, ఎస్+11అంతస్తుల రూపంలో 15,660 ఇళ్లను నిర్మించారు.ఒక్కోక ఇంటి నిర్మాణానికి రూ.7.90 లక్షలు, మౌలిక సదుపాయాలకు రూ.75వేలు, మెత్తం రూ.8.65 లక్షలను ఖర్చు చేశారు.

ఇందులో కేంద్రం ప్రభుత్వం వాటాగా ప్రతి ఇంటికి రూ.1.50లక్షలు పోను మిగిలిన వ్యయంలో మొత్తం రూ.1474.11కోట్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కొల్లూరులో నిర్మించిన ఈ కాలనీని దేశంలోనే అదర్శవంతమైన మరెక్కడా లేని విధంగాఅన్ని సౌకర్యాలతో మోడల్ సిటీగా నిర్మించడంతో పాటు పర్యావరణ హిత కాలనీగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఇందుకు జిహెచ్‌ఎంసి, జలమండలి, ఇపిటిఆర్‌ఐ, అర్బన్ బయోడైవర్సీటీ, రెన్యువబుల్ ఎనర్జీతో పాటు పలు ఇతర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. తద్వారా రూ.616 కోట్ల వ్యయంతో జీరో గార్బేజ్ ఉత్పత్తి,ఎస్‌టిపిల నిర్మాణం, గార్డెనింగ్, తాగునీరు,

విద్యుత్, అంతర్గత రోడ్లు, ఫైర్ సర్వీస్‌లు, విద్యా, రవాణా సౌకర్యాలను కల్పించారు. అంతేకాకుండా ఇక్కడ నివసించనున్న వారికి ఉపాధి కల్పనతో పాటు నిరంతరణ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా 145. 50 ఎకరాల స్థలంలో 37 శాతం స్థలంలో ఇళ్లను నిర్మించగా, 25 శాతం స్థలాన్ని గ్రీనరీ, పార్కులు, క్రీడా మైదానాలు, బహిరంగ ప్రదేశాలకు కేటాయించారు. మిగిలిన 38 శాతం స్థలాన్ని భవిష్యత్ అవసరాలకు కోసం ఖాళీగా వదిలిపెట్టారు.
హడ్కో బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు ః
కొల్లూరులో నిర్మించిన నిరుపేదల ఆత్మ గౌరవ లోంగిళ్లకు జాతీయ అవార్డులు లభించాయి. 2020 నవంబర్‌లో పట్టణ నిరుపేదల గృహాలు, మౌలిక వసతుల కల్పన పథకం కింద జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో హడ్కో ద్వారా బెస్ట్ ప్రాక్టీస్ అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన గృహా నిర్మాణ సముదాయాల ప్రదర్శనలో కొల్లూరు అవార్డును సొంతంచేసుకుంది. అదేవిధంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఏకో ఫ్రెండ్లీ టౌన్ షిప్‌ను వివిధ రా్రష్ట్రాలకు చెందిన గృహా నిర్మాణాల శాఖల అధికారులు సందర్శించి ఔరా అంటూ కితాబునిచ్చారు.
కొల్లూరు మెగా టౌన్ షిప్ విశేషాలు ః
ఎకరాలు, 117 బ్లాక్‌లు, ఎస్+9, ఎస్+10, ఎస్+11 అంతస్తుల భవనాలు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు మొత్తం 96,75,100 చ.అ.విస్తీర్ణం.
బ్లాక్‌కు 3 మీటర్ల విస్తీర్ణంలో రెండు మెట్లదారులు, 8 మంది సామర్థంతో రెండు లిప్టులు.
రూ.1489.29 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు మరో. రూ.616 కోట్లు
ఇళ్లు 580 చదరపుఅడుగు విస్తీర్ణం, రెండు పడక గదులు, ఓ హాల్ , కిచెన్, వరండా, రెండు బాత్‌రూమ్‌లు.
ఇంటికి రూ.7.90 లక్షల వ్యయం, మౌలిక సదుపాయాలకు మరో రూ.75 వేలు.
సిసిరోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైయిన్లు, మంచినీటి సరఫరా.
అంతర్గత డ్రైనేజీతో పాటుసీవరేజ్ ప్లాంటు(ఎస్‌టిపిలు)
వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు.
కాంప్లెక్స్‌తోపాటు కమ్యూనిటీ కాంప్లెక్స్‌లు
అంగన్‌వాడి కేంద్రాల ఏర్పాటు
బస్‌స్టేషన్ పోలీసు స్టేషన్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్
మతాల వారికి ప్రత్యేక ప్రార్థన కేంద్రాలు మందిరాలు.
ప్రత్యేక మున్సిపాలిటీగా కొల్లూరు ?
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తయిన తర్వతా ఇక్కడ నివసించే జనాభా ఒక మున్సిపాలిటీలో స్థాయిలో ఉండనుంది..దీంతో పురపాలక శాఖ సూచనలకు అనుగుణంగా ఒక మునిసిపాలిటీలో ఉండాల్సిన అన్ని సౌకర్యాలను ఇక్కడ జిహెచ్‌ఎంసి కల్పించాల్సింది. మంచినీటి సదుపాయం, మురుగు నీటి శుద్ది ఏర్పాట్లును వాటర్ బోర్డు పూర్తి చేసింది. అదేవిధంగా పాఠశాల, హాస్పిటల్, పార్కులు, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ మొదలయిన కనీస సదుపాయాలను త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కొల్లూరు టౌన్ షిప్‌ను పరిశుబ్రమైన కాలనీతో పాటు భద్రత పరంగా రక్షణతో కూడిన ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో ఇందుకు అనుగుణంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు.

అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కొల్లూరు సంగారెడ్డి జిల్లా పరిధిలోకి రానుండడంతో ఇక్కడ పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని కొంత మంది లభిదారులతో పాటు గ్రేటర్‌లోని గోషామహాల్, నాం పల్లి, ఖైరతాబాద్, శేరిలింగం పల్లి, జూబ్లి హిల్స్.., కార్వాన్, రాజేంద్ర నగర్, బహదూర్ పురా తదితర నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులకు ఈ ఇళ్లను అందజేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News