Wednesday, January 22, 2025

10న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా కొల్లూరు పోలీస్‌స్టేషన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రామచంద్రపురం: తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా మంజూరు అయిన కొల్లూరు పోలీస్ స్టేషన్ ను ఈనెల 10న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ఉస్మాన్ నగర్ పరిధిలోని మున్సిపల్ వార్డు కార్యాలయం ఆవరణలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ను ఆయన పరిశీలించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో మెరుగై న శాంతిభద్రతలు అందించాలన్న లక్ష్యంతో ప్ర భుత్వం నూతన పోలీస్ స్టేషన్ ను మంజూరు చే యడం జరిగిందని తెలిపారు.

పోలీస్‌స్టేషన్ భవనంతో పాటు తెల్లాపూర్ లో నూతనంగా నిర్మించ తలపెట్టిన బీరప్ప దేవాలయం, మల్లికార్జున స్వామి దేవాలయం, విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు మంత్రి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, మియాపూర్ ఏసిపి నరసింహారావు, సిఐ సంజయ్, స్థానిక కౌన్సిలర్ చిట్టి ఉమేష్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News