Thursday, January 23, 2025

ప్రారంభానికి సిద్ధంగా కొల్లూర్ డబుల్ బెడ్‌రూం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో : సొంతింటి కోసం సు దీర్ఘ కాలంగా ఎదరు చూస్తున్న వేలాది మంది నిరుపేదల కల త్వరలోనే నేరవేరబోనుంది. నిరుపేదలు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సంకల్పంతో జిహెచ్‌ఎంసి పరిధి లో ఎంపిక చేసిన 111 ప్రాంతాల్లో చేపట్టిన ఒక లక్ష డబుల్‌బెడ్ రూం గృహాల నిర్మాణ లక్ష్యం త్వరలో నెరవేరనున్నది. రామచంద్రపురం మండలం కొల్లూరు గ్రా మంలో రెండో దశ క్రింద చేపట్టిన 15,600 గృహాల ని ర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నా యి. దేశంలోనే మరి ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసేఅతి పె ద్ద హౌసింగ్ ప్రాజెక్టు ఇదే కావడం గమన్హారం. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జిహెచ్‌ఎంసి కమిషనర్ ప్రోద్బలంతో హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు అహర్నిశలు శ్రమించి ముఖ్యమంత్రి సంకల్పించిన లక్ష్యాన్ని నెరవేర్చారు. సకల హంగులతో పేదలకు మౌలిక సదుపాయం కల్పనలో చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్టమైన, మెరుగైన సౌకర్యాలు కల్పించారు. రూ.1422.15 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన అపార్ట్‌మెంట్లకు తీసి పోకుండా సకల హంగులతో నిర్మించారు. 115 బ్లాక్‌ల్లో గృహాల నిర్మాణాలు చేపట్టారు. అవసరాన్ని బట్టి ప్రతి బ్లాక్ రెండు లేదా మూడు స్తేయిర్ కేస్ ను ఏర్పాటు చేశారు. స్టిల్ట్ పార్కింగ్ తో పాటు పెవ్ బ్లాక్స్ , వాచ్ మెన్ గది ఏర్పాటు చేశారు. ప్రమాదాల నియంత్రణకు ఫైర్ ఫిటింగ్, 8 మంది కెపాసిటీ గల ప్రతి బ్లాక్ కు రెండు చొప్పున 234 లిఫ్ట్ లను ఏర్పాటు చేశారు. లిఫ్ట్ , గృహాలకు నిరంతర విద్యుత్ కోసం పవర్ బ్యాక్‌అప్ కోసం ప్రత్యేక జనరేటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు.
ప్రత్యేక మౌలిక వసతులు, సదుపాయాలు
నిరుపేదల కోసం కొల్లూరులో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల సముదాయంలో గేటెడ్ కమ్యూనిటీలను తలదన్నే రీతిలో ప్రభుత్వం ఇక్కడ సౌకర్యాలను కల్పించింది.పేదల కోసం నిర్మించారంటే ఎవరూ కూడా నమ్మసక్యంగా లేని రీతిలో అత్యాధునిక మౌలిక వసతులను ఇక్కడ కల్పించారు. ఇందులో ప్రధానమైవి.
6 నుండి 36 మీటర్ల వెడల్పు గల 13.50 కిలోమీటర్ల రోడ్డు, భవిష్యత్తులో రోడ్డు కట్టింగ్ లేకుండా నాలా ఏర్పాటు.
21 వేల కే.ఎల్ సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు,అండర్ గ్రౌండ్ ద్వారా విద్యుత్ కేబుల్ ఏర్పాటు.కామన్ ఏరియాలో లైటింగ్.
లిఫ్టులకు వాటర్ సప్లై, ఎస్.టి.పిలకు నిరంతర విద్యు త్ సరఫరా కోసం 30 కేవిఎ నుండి 400 కె.వి.ఎ వరకు 133 జనరేటర్ ఏర్పాటు చేశారు.
రూ.10 కోట్ల వ్యయంతో 9 ఎం.ఎల్.డి సామర్థ్యం గల ఎస్.టి.పి నీ ఇఎంబిబిఆర్ పద్దతిలో ఏర్పాటు చేసి చుట్టూ రోడ్డు వసతి కల్పించారు.
మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసి ఏర్పాటు చేసిన సుందరీకరణ పనులకు నీటి అందించేందుకు అవసరమైన పైప్ లైన్ ఏర్పాటు.
వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు.
మురికి నీరు బాక్సుల పైన 10.55 కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు.
10.05 కి మీ త్రాగు నీటి పైప్ లైన్,10.60 కి మీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్, 137 విద్యుత్ ట్రాన్స్ పార్మ ర్లు, వీధి దీపాల కోసం 528 పోల్స్, హైమస్కు లైట్ కోసం 11 పోల్స్ ఏర్పాటు చేశారు.
54000 చదరపు అడుగల విస్తీర్ణం గల 3 షాపింగ్ కాంప్లెక్స్ లలో 118 షాపులు ఏర్పాటు.
సామాజిక వసతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
కాలనీ వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కు, సైక్లింగ్ వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్ ఏర్పాటు.
ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్ ఏరియా, కిడ్స్ ల్లాట్ టట్స్, మల్టీ పర్పస్ గ్రౌండ్, హంపి థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం బతుకమ్మ ఘాట్ ఏర్పాటు.
ఇక్కడ నివసించే ప్రజల కోసం ఆధునిక కూరగాయల, మాంసాహార మార్కెట్ ఏర్పాటు.
ప్లే స్కూల్, అంగన్ వాడి సెంటర్, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు.
ప్రాథమిక ,ఉన్నత పాఠశాల, బస్ టెర్మినల్, బస్ స్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, మిల్క్ బూత్ లు, పెట్రోల్ బంకులు పోస్టాఫీసు, ఎ.టి.ఎం బ్యాంక్, ఏర్పాటు .
వెస్ట్ మేనేజ్మెంట్ యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News