తమిళనాడు డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్ సిబి) అరెస్టు చేసింది. నాలుగు నెలల క్రితం తమిళనాడులో రూ.180 కోట్ల విలువైన డ్రగ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను విచారించగా.. డ్రగ్స్ దందాలో జాఫర్ సాదిక్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలింది.
దేశ విదేశాల్లో దాదాపు రూ.2వేల కోట్ల విలువైన గ్రడ్స్ ను స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అప్పటికే జాఫర్ పరారయ్యాడు. దీంతో అతని సంబంధించిన నివాసాలు, ఆఫీసుల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వించారు. జాఫర్ ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో శనివారం జాఫర్ ఎన్సీబి అధికారులు పట్టుకున్నారు.
జాఫర్ కోలివుడ్‌లో పలు సినిమాలను నిర్మించాడు. డీఎంకే పార్టీలో చేరి ఎన్‌ఆర్‌ఐ విభాగంలో పనిచేశాడు. అయితే, డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో జాఫర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.