Monday, December 23, 2024

నిజాం గుండెల్లో సింహ స్వప్నం కొమరం భీమ్

- Advertisement -
- Advertisement -

గుండాల : నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీమ్ అని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. గుండాల మండల కేంద్రంలోని శెట్టుపల్లి గ్రామాంలో మొదట తుడుందెబ్బ జెండాను మండల అధ్యక్షుడు గొవింద నర్ససింహారావు చేతుల మిదుగా ఎగారవేశారు. అనంతరం కొమరం భీమ్ విగ్రహాన్ని ముఖ్య అతిథులు తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణ లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపెందర్, కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు చేతుల మీధుగా అదివారం విగ్రహ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవిని జీవనోపాధిగా చేసుకొన్న కొమరం భీమ్ నిజాంలను ఎదురించాడని తెలిపారు. నిజాం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాటం చేశాడన్నారు. కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సలిపిన శెట్టుపల్లి గడ్డపై కొమరం భీమ్ స్ఫూర్తిదాయక ఉద్యమ పోరాటాలకు చిహ్నం కొమరం భీమ్ విగ్రహం ఆవిష్కరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మాజి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, గుండాల ఎంపిపి ముక్తి సత్యం, జడ్ప్‌టిసి రామక్క, గుండాల సర్పంచ కొరం సీతరాములు, ప్రజాపంథా మండల కార్యదర్శి ఈసం శంకర్, మాజి సర్పంచ్ కొమరం శాంతయ్య, దొరపాటెల్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News