Saturday, November 23, 2024

బతుకమ్మ పండుగ…. కోమటి చెరువు ముస్తాబు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

బతుకమ్మ పండుగ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

బతుకమ్మ పండుగ సందర్భంగా కోమటి చెరువుపై 3, 4 రోజుల పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్

బతుకమ్మ పండుగ సందర్భంగా కోమటి చెరువును సందర్శించి ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

Komati cheruvu declaration for bathukamma festival

సిద్ధిపేట : బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. శనివారం సిద్ధిపేట కోమటి చెరువు పై జరగనున్న సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలపై సిపి జోయల్ డేవిస్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఈ నెల 6 నుంచి 15 వరకు బతుకమ్మ పండుగ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోనే అతి పెద్ద పండుగ బతుకమ్మ, దసరా, సద్దుల బతుకమ్మ పండుగల రోజున కోమటి చెరువుకు వచ్చే ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు. కొత్తదనంతో కోమటి చెరువు అందంగా ముస్తాబు అవుతున్నదని, బతుకమ్మ పండుగ సందర్భంగా కోమటి చెరువుపై 3, 4 రోజుల పాటు టూరిజం ఆధ్వర్యంలో ప్రజలకు కన్నుల పండుగగా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ నెల 6వ తేదీ నుంచి మ్యూజికల్ ఆక్వా స్క్రీన్ ఫౌంటెయిన్ అందుబాటులోకి…

కోమటి చెరువు పై అత్యంత సుందరంగా గ్లో గార్డెన్…

ఈ నెల 6వ తేదీన కోమటి చేరువుపై మ్యూజికల్ ఆక్వా స్క్రీన్ ఫౌంటెయిన్ అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మ్యూజికల్ ఆక్వా స్క్రీన్ గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదిపై వడోదరలో మొదటిది ఏర్పాటు చేసినట్లు, దేశంలోనే రెండవది మన సిద్ధిపేట కోమటి చెరువు పై ప్రారంభం చేసుకోబోతున్నట్లు, ఇందుకు కావాల్సిన సామాగ్రిని చైనా నుంచి తెప్పించినట్లు మంత్రి తెలిపారు.

ప్రశాంత్ నగర్ నుంచి వచ్చే ప్రజలకు నెక్లెస్ రోడ్ పై ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసినట్లు, అత్యంత సుందరంగా కోమటి చెరువు పై గ్లో గార్డెన్ ఉంటుందని, ప్రజలకు కనువిందు చేసేలా కోమటి చెరువు రంగు రంగుల లైటింగ్ లతో అందాలు ఉంటాయని వివరించారు.

రంగనాయక సాగర్ నిండుగా ఉన్న దరిమిలా ప్రజలెవరు బతుకమ్మ నిమజ్జనం కోసం అటువైపు వెళ్లొద్దని, పట్టణంలోని కోమటి చెరువు, ఆ ప్రాంత వాసుల కోసమై ఎర్ర చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. లైటింగ్ తో పాటు ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను అందుబాటులో నిలపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
జనరేటర్ బ్యాకప్ సిస్టమ్ తో పాటుగా సద్దుల బతుకమ్మ పండుగ రోజున ఎక్కువగా ప్రజలు వచ్చే అవకాశం ఉంటుందని, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సిపి జోయల్ డేవిస్ కు మంత్రి సూచించారు.

సిద్ధిపేట జిల్లాలోని అన్నీ మున్సిపాలిటీల్లో నిధులు ఉపయోగించి, ప్రజలకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూడాలని ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులను హరీష్ రావు ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, ఇంజనీరింగ్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News