Friday, January 24, 2025

కోమటి చెరువు మీని ట్యాంక్ బండ్ సరసన మరో మణిహారం

- Advertisement -
- Advertisement -
  • డైనోసార్ పార్కు, వాటర్ గేమింగ్ పాయింట్
  • పనులు త్వరగా పూర్తి చేయాలి
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: కోమటి చెరువు మీని ట్యాంక్ బండ్ సరసన మరో మణిహారం డైనో సార్ పార్క్, వాటర్ గేమింగ్ పాయింట్ చేరనున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువును ఆదివారం సందర్శించారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న డైనోసార్ పార్క్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబం సన్నిహితులతో కలిసి వినోద ఉద్యావనవనానికి పిక్నిక్ వ చ్చినట్లు అనుభవాలు మరిచిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తున్న సిద్దిపేట కోమటి చె రువు చెంతన మరో రకమైన సాహస అనుభవాన్ని, జ్ఞాపకాన్ని మధురానుభూతిని కలిగించేలా డైనోసార్ పార్క్ , వాటర్ గేమింగ్ పాయింట్ ఉండబోతుందని తెలిపారు.

డైనోసార్ పార్క్ విశేషాలు

మీరు డైనోసార్ల యుగంలో వెళ్లాలని అనుకుంటే మీరు తప్పనిసరిగా సిద్దిపేట మీని ట్యాంక్ బండ్ రావాల్సిందే. డైనో సార్ పార్కును సందర్శించాల్సిందే అన్నట్లుగా ఈ డైనోసార్ థీమ్ పార్క్, మ్యూజియం కలయికగా ఉండనున్నది. ఈ పార్కులో పెద్దలు, పిల్లలు ఇద్దరికి మంచి ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తుంది. 4డీ సినిమా తరహాలోనే ప్రత్యక్షంగా చూడటమే డైనోసార్ ప్రత్యేక పార్కు సందర్శన వినోదాత్మకంగా ఓ విన్నూత అనుభూతి, అనుభవం కలుగుతుంది. ఈ పార్క్‌లో పలు రకాలైన యనిమేట్రానిక్స్ ,డైనోసార్‌లు అతి పెద్ద 4డీ సిమ్యులేటర్ ఉండనున్నాయి. తవ్విన గుహలో అంతరించిపోయిన మాంసాహార డైనోసార్లతో ముఖా ముఖిగా మిమ్మల్ని పలకరింపులోకి తీసుకుని రానున్నది.

వాటర్ గేమింగ్ పాయింట్

కోమటి చెరువు రూబీ నెక్లెస్ రోడ్ మొత్తం 3.3 కిలో మీటర్ల మేర ఉంటుంది. దీంట్లో బాగంగా మూడవ డెక్‌లో చిన్నా పెద్దలు ద్రిల్లింగ్ పొందేలా వాటర్ గేమింగ్ జోన్ పాయింట్ ఆగస్టు నెలాఖరుకు త్వరలోనే అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టర్లను అదేశించారు. ఈ వాటర్ గేమింగ్ పాయింట్‌లో వాటర్ స్లైడ్లు కిందకు జారడం చూపరులను ఆకర్షించి ద్రిల్లింగ్ కలుగనుందని తెలిపారు. ఈ వాటర్ గేమింగ్ పాయింట్‌లో వాటర్ స్లయిడ్‌లు చిన్నవిగా ఉంటాయి. కానీ సమానంగా సరదాగా ఉంటాయి. పెద్దలు అలాగే పిల్లలు కూడా ఈ వాటర్ పార్కులో థ్రిల్ అవుతూ జారుతున్నట్లు ఉన్న వాటర్ చూస్తు ఎంతో అనుభూతి చెందుతాకరని తెలిపారు. ఈ మేరకు మీని ట్యాంక్ బండ్ పై కలియ తిరుగుతూ అక్కడికి సందర్శనకు వచ్చిన వారితో మాటామంతి కలిపారు. కుటుంబీకులతో కాలక్షేపానికి వచ్చిన టూరిస్టులు, యువత మంత్రితో సెల్పీ దిగేందుకు పోటి పడ్డారు. ఇదే క్రమంలో నెక్లెస్ రోడ్డు ఫేజ్ వారిగా ఉన్న నిర్మాణ పనులు పరిశీలిస్తూ పనులు ముమ్మరం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను అదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల చైర్మన్ రాజనర్సు, ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News