Monday, January 20, 2025

చదువుల తల్లికి అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
వాట్సప్ మెసేజ్ తో కోమటిరెడ్డి సహాయం
అన్న అంటే నేనున్నా అనే మన వెంకన్న మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు…
తెలంగాణలో ప్రతి విద్యార్థి తన బిడ్డలే అని ఎప్పుడు చెప్పే వెంకన్న పేద విద్యార్థులకు అండగా ఉంటున్నారు
చదువుకోవాలనే కోరికవున్న పేదరికంతో బాధపడుతున్న విద్యార్థినికి వెంకన్న నేను చదివిస్తా అని భరోసానిచ్చారు
Komati reddy help to Student with Financial assistance
 హైదరాబాద్: నల్గొండ జిల్లా పెద్దబండ మండలం గొల్లగూడా గ్రామానికి చెందిన బోడ అమృత వర్శిని అనే విద్యార్థిని ఒక పేద కుటుంబంలో జన్మించింది. అమృత తండ్రి ఒక ఆటో డ్రైవర్, తల్లి టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అమృత వర్శిని తన చదువును కొనసాగిస్తోంది.. ఫైలెట్ కావాలనే ద్యేయం తో కష్టపడి చదివి ఫైలెట్ గా సెలక్ట్ అయ్యింది. ప్రస్తుతం ట్రైనింగ్ దశలో ఉన్న వర్శినికి తన చదువు పూర్తి చేయాలంటే 6 లక్షల రూపాయలు కావాలి. వాళ్ళ ఆర్ధిక పరిస్థితి అంతంత మాతంగ్రానే ఉండడంతో డబ్బులు కట్టడం కష్టంగా మారింది. దిక్కుతోచని పరిస్థితిలో వర్శినికి కోమటిరెడ్డి వెంకన్న గుర్తుకు వచ్చారు.
తన పరిస్థితి తన లక్ష్యాన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తెలియజేసింది వెంటనే ఆయన స్పందించి విద్యార్థినినీ తన ఇంటికి పిలిపించుకుని 2 లక్షల రూపాయలు ఇచ్చి తన చదువుకు అయ్యే పూర్తి ఖర్చు తానే ఇస్తానని హామీ ఇచ్చారు. అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పది అని నమ్మే వెంకన్న పేద విద్యార్థికి సహాయం చేశారు.
ఈ సందర్భంగా ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లా నుంచి ఎప్పటి వరకు డాక్టర్లు, ఇంజనీర్లను మాత్రమే చదివించానని, తనకు ఇప్పుడు అమృత వర్షిణి పైలెట్ చదువుకు సహకరించి జిల్లా నుంచి ఓ పైలెట్ ను తయారు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అమృత చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియ జేశారు.
అలాగే విద్యార్థిని అమృత వర్షిణి మాట్లాడుతూ తన చదువుకు సహకరిస్తున్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో మంది ఇతర నేతల చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని, కానీ ఒక్క వాట్సాప్ మెసేజ్ తో వెంకట్ రెడ్డి స్పందించి తన చదువుకు అండగా నిలిచారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి నేత ఉండడం చాలా అదృష్టమని కొనియాడారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News