Sunday, December 22, 2024

వలిగొండలో కాంగ్రెస్ నాయకుడి అంతిమయాత్రలో పాల్గొన్న కోమటి రెడ్డి

- Advertisement -
వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల నర్సయ్య శుక్రవారం గుండెపోటుతో చనిపోయారు. శనివారం నర్సయ్య స్వగ్రామం నర్సాయిగూడెంలో జరిగిన నర్సయ్య అంతిమయాత్రలో ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. నర్సయ్య కుటుంబసభ్యులను కోమటి రెడ్డి పరామర్శించి  ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు నర్సయ్య అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. ఆయన గురించి తెలియని వారుండరని స్థానికులు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సర్పంచ్ గా ఎంపిపిగా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News