Sunday, January 19, 2025

హరీష్‌కు దమ్ముంటే మెదక్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలి: కోమటి రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎ హరీష్ రావు బిఆర్‌ఎస్‌లో ఉద్యోగి మాత్రమేనని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీతో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ విసిరిన సవాల్ కు కోమటి రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. రాజీనామా లేఖతో మరోసారి హరీష్ రావు రాజకీయ డ్రామాలకు తెరలేపాడని మండిపడ్డారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని, ఇప్పుడు కూడా ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకంటించారని, చేసి తీరుతామన్నారు. హరీష్ రావు మాటలు జనాలు నమ్మడం లేదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే హరీష్ మాట చెల్లలేదని, ఇప్పుడు చెల్లుతుందా? అని చురకలంటించారు. హరీష్‌కు దమ్ముంటే మెదక్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. హరీష్ రావు ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయమంటే భయపడుతున్నారని, కాంగ్రెస్‌ను విమర్శించడం బిఆర్‌ఎస్ నేతలు మానుకోవాలని కోమటిరెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News