Saturday, January 4, 2025

కోమటిరెడ్డి వీడియో క్లిప్పింగ్‌ను చూసిన ఠాక్రే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ వీడియో క్లిప్పింగ్‌ను కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు  ఠాక్రే చూశారు. మాణిక్ రావు ఠాక్రే కోమటి రెడ్డి వివరణ కోరనున్నారు. కోమటి రెడ్డి వివరణ తరువాత ఎఐసిసికి ఠాక్రే రిపోర్ట్ ఇవ్వనున్నారు. కోమటి రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఠాక్రేపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని ఇతర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఆ పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది. బిఆర్‌ఎస్‌తో పొత్తు విషయమై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెర తీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ముక్తకంఠంతో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News