Sunday, January 19, 2025

Komatireddy: ఆ వార్తలను ఖండించిన కోమటి రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పార్టీ మారేవాడినే అయితే టిపిసిసి పదవి ఇవ్వనప్పుడే మారేవాడినని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కోమటిరెడ్డి ఖండించారు. నిరాధార వార్తలతో కార్యకర్తలను అయోమయంలో పడేయొద్దని సూచించారు. పార్టీ ఆదేశిస్తే మళ్లీ ఎంఎల్‌ఎగా, ఎంపిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పదవి వస్తుందని ఆశిస్తున్నానని, కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News