- Advertisement -
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ఇంజినీర్ల సలహాలు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్నారా? లేక చీఫ్ ఇంజినీర్‌గా పని చేశారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. మూడో టిఎంసి అవసరం లేదని, మూడో టిఎం సి కెసిఆర్ బంధువు కోసం చేశారని దుయ్యబట్టారు. ఇంజినీర్లుగా సలహాలు ఇవ్వాలని కానీ వినకపోతే సెలవు పెట్టి పోవాలని సూచించారు. కొండ పోచమ్మ ఎప్పుడూ నిండుగా ఉంటుందని, ఫామ్‌హౌస్‌కు తప్పితే ఇతర పొలాలకు నీరు పోదని చురకలంటించారు. ఇంత ఖర్చు చేసినా ఎంత ఆయకట్టుకు నీరు వెళ్తోందో చెప్పడంలేదని మంత్రి చురకలంటించారు.
- Advertisement -