Wednesday, January 22, 2025

కెసిఆర్‌కు బిసిని సిఎం చేసే దమ్ముందా?: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 24 గంటల కరెంట్‌పై సిఎం కెసిఆర్ మోసం చేశారని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి తెలిపారు. యుద్ధానికి వంద రోజులే ఉందని, ఈ యుద్ధంలో ప్రజలు గెలవాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న సమస్యలున్నా అందరం కలిసి పని చేస్తామన్నారు. త్వరలో బసు యాత్ర చేపడుతామన్నారు. పిఎసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వివరించారు. ఈ నెల 30న కొల్లాపూర్‌లో ప్రియాంక గాంధీ సభ ఉంటుందని, ప్రియాంక సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తామని, రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని, ధరణి తీసుకొచ్చి పేదల భూములను లాక్కున్నారని, కెసిఆర్ మోసాలను ప్రజలు గమనించారని, కెసిఆర్ కుటుంబం తప్పా రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదని కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. దమ్ముంటే కెసిఆర్ తరువాత కెటిఆర్ కాకుండా బిసిని సిఎం చేస్తానని ప్రకటించాలని సవాలు విసిరారు. బిసిలకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.

Also Read: ఆకలినైనా భరిస్తాం.. ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఊరుకోం: గంగుల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News